పంచాయతీ లేఅవుట్లతో జర జాగ్రత్త....
పంచాయతీ లేఅవుట్లతో జర జాగ్రత్త.... నగర శివార్లలో పాత లేఅవుట్లలోనే క్రయ విక్రయాలు హైదరాబాద్ శివార్లలో ఇప్పటికీ పంచాయతీ లేఅవుట్లు వేలల్లోనే ఉన్నాయి. వాటిలో రీసేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. కొత్త వెంచర్లు అంటే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనుమతితో అభివృద్ధి చేస్తున్న వెంచర్లు ఔటర్ రింగు రోడ్డు బయటే అధికంగా ఉన్నాయి. కాబట్టి పంచాయతీ లేఅవుట్లలోకొనుగోలు చేసే ప్లాట్లకు ధర తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మొదట గుర్తించారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి నగరం నుంచి 50 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో ఎక్కడ లేఅవుట్ చేసినా కనీసం రోడ్డు వెడల్పు 33 ఫీట్లు ఉండాలి. కానీ పంచాయతీ లేఅవుట్లలో మాత్రం 25,30 ఫీట్ల లోపే అధికంగా ఉన్నాయి. ఇలాంటి ప్లాట్ల కొనుగోలు సమయంలో హెచ్‌ఎండీఏ అనుమతి, రోడ్ల వెడల్పు వంటి విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించి కొనుగోలు చేయాలి. లేదంటే పంచాయితీ లేఅవుట్లలో కొనుగోలు చేస్తే రోడ్డు కటింగ్ చేసిన తర్వాత ఇంటి నిర్మాణానికి అనుమతిస్తారు. దీనివల్ల కొనుగోలు చేసిన స్థలంలో కొంత స్థలాన్ని రోడ్డు కోసం వదిలేయాల్సి వస్తుంది. అదేవిధంగా పంచాయతీ లేఅవుట్లలో ...