పంచాయతీ లేఅవుట్లతో జర జాగ్రత్త....
పంచాయతీ లేఅవుట్లతో జర జాగ్రత్త....
నగర శివార్లలో పాత లేఅవుట్లలోనే క్రయ విక్రయాలు
హైదరాబాద్ శివార్లలో ఇప్పటికీ పంచాయతీ లేఅవుట్లు వేలల్లోనే ఉన్నాయి. వాటిలో రీసేల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. కొత్త వెంచర్లు అంటే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అనుమతితో అభివృద్ధి చేస్తున్న వెంచర్లు ఔటర్ రింగు రోడ్డు బయటే అధికంగా ఉన్నాయి. కాబట్టి పంచాయతీ లేఅవుట్లలోకొనుగోలు చేసే ప్లాట్లకు ధర తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మొదట గుర్తించారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి నగరం నుంచి 50 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో ఎక్కడ లేఅవుట్ చేసినా కనీసం రోడ్డు వెడల్పు 33 ఫీట్లు ఉండాలి. కానీ పంచాయతీ లేఅవుట్లలో మాత్రం 25,30 ఫీట్ల లోపే అధికంగా ఉన్నాయి. ఇలాంటి ప్లాట్ల కొనుగోలు సమయంలో హెచ్‌ఎండీఏ అనుమతి, రోడ్ల వెడల్పు వంటి విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించి కొనుగోలు చేయాలి. లేదంటే పంచాయితీ లేఅవుట్లలో కొనుగోలు చేస్తే రోడ్డు కటింగ్ చేసిన తర్వాత ఇంటి నిర్మాణానికి అనుమతిస్తారు. దీనివల్ల కొనుగోలు చేసిన స్థలంలో కొంత స్థలాన్ని రోడ్డు కోసం వదిలేయాల్సి వస్తుంది. అదేవిధంగా పంచాయతీ లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్, విద్యుత్, ఓవర్ హెడ్ ట్యాంక్, పార్కులు వంటి మౌలిక వసతులు సరిగా ఉండవు. అయినా ధర మాత్రం ఎక్కువగా చెప్పి విక్రయాలు చేస్తుంటారు. ఈ విషయాలను కొనుగోలుదారులు గుర్తించాలి. ప్రాంతాన్ని బట్టి, అక్కడి మౌలిక వసతులను బట్టి ప్లాట్ల ధరలు ఉండాలని, మధ్యవర్తులు చెప్పే మాటలని గుడ్డిగా నమ్మకుండా అన్ని విషయాలను బేరీజు వేసుకొని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
శివారు చుట్టూ డిమాండ్...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా, హైదరాబాద్ నగరంలో మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో బాగానే ఉందని రియల్ రంగం నిపుణులు చెబుతున్నారు. దీంతో నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ప్లాట్స్, ఫ్లాట్లకు డిమాండ్ ఉంది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి ఊపొచ్చింది. ముఖ్యంగా నగర శివారులోని ఆదిభట్లలో టాటా ఏరోస్పేస్, టీసీఎస్ ఐటీ పరిశ్రమ నిర్మాణం, ముచ్చర్లలో ఫార్మాసిటీల నిర్మాణం స్థిరాస్తి రంగానికి మరింత ఊపునిచ్చాయి. మరోవైపు నగరం చుట్టూ కొత్తకొత్త టౌన్‌షిప్‌లు ఏర్పాటుతో పెద్ద ఎత్తున వాణిజ్య నిర్మాణాలకు కూడా డిమాండ్ ఏర్పడింది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు భూయజమానులతో ఒప్పందం చేసుకుని స్థలాలను అభివృద్ధి చేస్తున్నారు. హయత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, నాదర్‌గుల్, బడంగ్‌పేట, బాచుపల్లి, గండిమైసమ్మ, బౌరంపేట, అమీన్‌పూర్, బీరంగూడ తదితర ప్రాంతాల్లో ఇండిపెండెంట్ గృహాలకు డిమాండు పెరిగింది. అదే సమయంలో నగరంలోని అమీర్‌పేట, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, సంజీవరెడ్డినగర్, కూకట్‌పల్లి, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అపార్టుమెంట్లలోని ప్లాట్లకు డిమాండు నెలకొంది. చాలా మంది తమ సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. తమ బడ్జెట్‌ను బట్టి కోర్ సిటీలో లేదంటే శివార్లలో ఎక్కడయినా కొనుగో
నివాసానికి అనుకూలంగా శివార్లు
నగరానికి పడమర దిక్కున ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల పలు జాతీయ, అంతర్జాతీచ ఐటీ కంపెనీలు తరలివచ్చాయి. దీంతో వాటి సమీప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా విస్తరించింది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. ఈ ప్రదేశాలు ఐటీ కేంద్రాలకు చేరువలో ఉండడంతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత ఐటీ కారిడార్‌కు ఉత్తరం వైపు ఉన్న ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ వరకు కొనుగోలుకు ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అదేవిధంగా మెట్రో రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది దృష్టి ఉప్పల్ వైపు పడింది. ఇక్కడి నుంచి వరంగల్ రహదారి మార్గంలో ఘట్‌కేసర్ వరకు వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. పశ్చిమంలోని ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో ఉద్యోగులు ఇటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. జాతీయ రహదారి మీదున్న ప్రాంతాల పొడువునా నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గతేడాది నుంచే మెట్రో రవాణా సదుపాయం అందుబాటులోకి రావడంతో నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది. రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం చుట్టుపక్కల 10–12 కిలోమీటర్ల వరకు నివాస ప్రాంతాలు విస్తరించాయి. మౌలాలి, తిరుమలగిరి, ఈసీఐఎల్, సైనిక్‌పురి, ఏ.ఎస్.రావునగర్, కొంపల్లి, శామీర్‌పేట, దమ్మాయిగూడెం, కాప్రా వరకు బహుళ అంతస్తుల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది.
Comments
Post a Comment