సంక్రాంతి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే క్రమం తప్పకుండా ముఖ్యమైన సందర్భాలలో లేదా సెలవులు/పండుగ సీజన్లలో రైలు ప్రయాణీకుల అవసరాల ను తీర్చడానికి , అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. జనవరి నెలలో సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికుల నుండి డిమాండ్ అధికంగా వుంటుంది . ముఖ్యంగా , దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సంక్రాంతి పండుగ మరియు సెలవుల సీజన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అదిక డిమాండ్ వుంది. ఇందుకు అనుగుణంగా సెలవుల కాలంలో అదనపు ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి , అలాగే రైలు ప్రయాణికుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి వివిధ గమ్యస్థానాల మధ్య అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు జనవరి 1 నుంచి జనవరి 20 వరకు వేర్వేరు తేదీల్లో నడపబడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పైన పేర్కొన్న తేదీలలో 94 ప్రత్యేక రైలు సర్వీసు సేవలను ప్రక...