సంక్రాంతి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

 

 


దక్షిణ మధ్య రైల్వే క్రమం తప్పకుండా ముఖ్యమైన సందర్భాలలో లేదా సెలవులు/పండుగ సీజన్లలో రైలు ప్రయాణీకుల అవసరాల ను తీర్చడానికి, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోని  ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.  జనవరి నెలలో సంక్రాంతి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే   రైలు ప్రయాణికుల నుండి డిమాండ్ అధికంగా వుంటుంది .  ముఖ్యంగా, దక్షిణ మధ్య రైల్వే  పరిధిలో సంక్రాంతి పండుగ మరియు సెలవుల సీజన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి   అదిక డిమాండ్ వుంది.

 

 ఇందుకు అనుగుణంగా సెలవుల కాలంలో అదనపు ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి,  అలాగే రైలు ప్రయాణికుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి వివిధ గమ్యస్థానాల మధ్య అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే  నడపనున్నట్లు ప్రకటించింది.  ఈ రైళ్లు జనవరి 1 నుంచి జనవరి 20 వరకు వేర్వేరు తేదీల్లో నడపబడుతున్నాయి.

 

  దక్షిణ మధ్య రైల్వే  పైన పేర్కొన్న తేదీలలో 94 ప్రత్యేక రైలు సర్వీసు  సేవలను ప్రకటించింది.ఇవి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా ఇతర ప్రసిద్ధ గమ్యస్థానాలకు కూడా నడపబడతాయి.  ఈ రైలు సర్వీసులు వివిధ క్లాస్ లను కలిగి ఉంటాయి, ఇందులో రిజర్వ్‌డ్ కోచ్‌లు మరియు అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు అన్ని విభాగాల ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.  రిజర్వ్ చేయబడిన వసతిని కోరుకునే రైలు వినియోగదారులు రైల్వే పి ఆర్ ఎస్ కౌంటర్ ల తో  పాటు ఐ.ఆర్.  సి .టి . సి వెబ్‌సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.  అదేవిధంగా, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు తమ టిక్కెట్‌లను మొబైల్ యాప్‌లో  యు టి ఎస్  ద్వారా కొనుగోలు చేయవచ్చు, తద్వారా జనరల్ కౌంటర్‌ల వద్ద క్యూలో నిలబడకుండా నివారించవచ్చు.

 

 జోన్ అందించిన అదనపు ప్రయాణ సౌకర్యాన్ని రైలు ప్రయాణికులు వినియోగించుకోవాలని మరియు వారి ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మరియు ఇబ్బంది లేకుండా తమ  ప్రయాణం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.  సంక్రాంతి రద్దీని నివారించేందుకు మరియు అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా సమీకరించడం ద్వారా ప్రయాణికులను సాఫీగా రవాణా చేయడానికి జోన్  అనేక చర్యలు తీసుకుంటోంది.  రానున్న రోజుల్లో రోలింగ్ స్టాక్, రూట్, సిబ్బంది తదితర వనరుల లభ్యత మేరకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టేందుకు జోన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయాణికులప్రయోజనం కోసం రైళ్లను మరింత ప్రభావవంతంగా నడపడానికి, డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాలను క్రమం తప్పకుండా విశ్లేషిస్తున్నారు.

 

 

 దక్షిణ మధ్య రైల్వే నుంచి నడపబడుతున్న సంక్రాంతి ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 

Sl.

Tr. No.

From - To

Days of Run

JCO

January-2023

1         

07067

Machilipatnam – Kurnool City

Sa, Tu, Th

3, 5, 7, 10, 12, 14, 17

2         

07068

Kurnool City – Machilipatnam

Sun, Wed, Fri

4, 6, 8, 11, 13, 15, 18

3         

07445

Kakinada Town – Lingampalli

Mon, Wed, Fri

2, 4, 6, 9, 11, 13, 16, 18

4         

07446

Lingampalli – Kakinada Town

Tue, Thu, Sat

3, 5, 7, 10, 12, 14, 17, 19

5         

07185

Machilipatnam – Secunderabad

Sun

1, 8, 15

6         

07186

Secunderabad – Machilipatnam

Sun

1, 8, 15

7         

07095

Machilipatnam – Tirupati

Sun, Mon, Wed, Fri

1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16

8         

07096

Tirupati – Machilipatnam

Mon, Tue, Thu, Sat

2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17

9         

07698

Vijayawada – Nagarsol

Fri

6, 13

10     

07699

Nagarsol – Vijayawada

Sat

7, 14

11     

07607

Purna – Tirupati

Mon

2, 9, 16

12     

07608

Tirupati – Purna

Tue

3, 10, 17

13     

07605

Tirupati – Akola

Fri

6, 13

14     

07606

Akola – Tirupati

Sun

8, 15

15     

07165

Secunderabad – Cuttack

Fri

6,13

16     

07166

Cuttack – Secunderabad

Sat

7, 14

17     

07431

Nanded – Brahmapur

Sat

7,14

18     

07432

Brahmapur – Nanded

Sun

8,15

19     

07093

Nanded – Yesvantpur

Mon

2,9

20     

07094

Yesvantpur – Nanded

Tue

3,10

21     

07265

Hyderabad – Yesvantpur

Tue

3,10,17

22     

07266

Yesvantpur – Hyderabad

Wed

4,11,18

23     

07233

Secunderabad – Yesvantpur

Thu

5,12,19

24     

07234

Yesvantpur – Secunderabad

Fri

6,13,20

 

Comments

Popular posts from this blog

Real Estate PE Investments Log 40% Annual Rise in 1H FY23 - ANAROCK Capital

Minister KTR holds meeting on preparations for Hyd Metro Rail Phase-II foundation stone laying ceremony

*అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన : రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు*