*డిసెంబర్ 9న జరిగే మెట్రో రైల్ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ పై కేటీఆర్ సమీక్ష




*

నగర మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కేటీఆర్ సన్నాహక సమావేశం


హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కే. తారకరామారావు ఈరోజు నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,డిజిపి, మెట్రో రైల్, పురపాలక, ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని, శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని, ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 9వ తేదీన శంకుస్థాపన వేసే ప్రాంతంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పాల్గొనే సమావేశ ప్రాంగణం వంటి వాటి ఏర్పాట్లను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు రేపు మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికల పైన ఇప్పటినుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 

హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని, ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు కావడం వలన నగర వ్యాప్తంగా ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని  కేటీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి లకు మంత్రి కేటీఆర్ సూచించారు.

Comments

Popular posts from this blog

Real Estate PE Investments Log 40% Annual Rise in 1H FY23 - ANAROCK Capital

Minister KTR holds meeting on preparations for Hyd Metro Rail Phase-II foundation stone laying ceremony

*అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన : రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు*